గర్భిణీ ఏనుగును చంపిన కేసులో ఒకరు అరెస్టు

గర్భిణీ ఏనుగును చంపిన కేసులో ఒకరు అరెస్టు
X

కేరళలోని పాలక్కాడ్‌ జిల్లా సరిహద్దుల్లో పేలుడు పదార్థాలున్న ఫైనాపిల్ పండును తిని గాయాలపాలై ఇటీవల మరణించిన గర్భిణీ ఏనుగు ఘటనపై సర్వ త్రా ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. పౌరసమాజం తోపాటు సోషల్ మీడియాలో ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న కేరళ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసింది.

అయితే గర్భిణీ ఏనుగును చంపిన కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు కేరళ అటవీ శాఖ మంత్రి కె.రాజు తెలిపారు. ఈ ఘటనలో మరికొంతమంది పాల్గొన్నారని, మిగతావారిని కూడా పట్టుకునేందుకు పోలీసులు, అటవీ శాఖ దర్యాప్తు జరుపుతున్నారని మంత్రి స్పష్టం చేశారు. కాగా సైలెంట్ వ్యాలీ ఫారెస్ట్‌లో శక్తివంతమైన ఫైర్ క్రాకర్స్‌తో నిండిన పైనాపిల్‌ను 15 ఏళ్ల ఏనుగు తినడంతో ఇది ఒక వారం తరువాత వెల్లియార్ నదిలో మరణించింది.

Tags

Next Story