తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అరెస్ట్

తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అరెస్ట్

మంజీరా డ్యామ్ సందర్శనకు వెళ్తున్న కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పటాన్‌చెరు టోల్‌ప్లాజా వద్ద పీసీసీ చీఫ్ ఉత్తమ్, జగ్గారెడ్డి సహా ముఖ్యనేతలను అడ్డుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తెలంగాణలో ప్రాజెక్టుల సందర్శనకు పిలుపు ఇచ్చిన కాంగ్రెస్ నేతలు మంజీరా డ్యామ్‌ను పరిశీలించాలని నిర్ణయించారు. ఐతే..ఈ టూర్‌కి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.. పీసీసీ చీఫ్ ఉత్తమ్, జగ్గారెడ్డి సహా ముఖ్యనేతలను నిలువరించేందుకు ఉదయం నుంచే భారీగా పోలీసులను మోహరించారు. చివరికి బస్సులో బయల్దేరిన కాంగ్రెస్‌ నేతలను మధ్యలోనే అడ్డుకొని అరెస్ట్ చేశారు..

మంజీరా నీటిని పూర్తిగా తోడేసి ఇతర అవసరాలకు వాడిన నేపథ్యంలో.. గోదావరి జలాలతో డ్యామ్‌ను నింపాలనేది కాంగ్రెస్ డిమాండ్. ప్రభుత్వం ఈ ఆరేళ్లలో ప్రాజెక్టుల విషయంలో సరైన ప్రణాళిక లేకుండా వెళ్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story