అల్-ఖైదా నాయకుడు అబ్దేల్‌మాలిక్ హతం..

అల్-ఖైదా నాయకుడు అబ్దేల్‌మాలిక్ హతం..

ఉత్తర ఆఫ్రికా అల్-ఖైదా నాయకుడు అబ్దేల్‌మలెక్ డ్రౌక్‌డెల్‌ను ఫ్రెంచ్ బలగాలు హతమార్చాయని ఫ్రాన్స్ రక్షణ మంత్రి ప్రకటించారు, 7 సంవత్సరాలపాటు సహెల్‌లో జిహాదీలతో పోరాడుతున్న ఫ్రాన్స్‌కు ఇది ఒక పెద్ద విజయం. జూన్ 3 న, ఫ్రెంచ్ సైనిక దళాలు , స్థానిక భద్రతా దళాలతో కలిసి, ఉగ్రవాది అబ్దేల్ తోపాటు అతని సహచరులు ఉంటున్న రహస్య స్థావరంపై దాడి చేశారు. ఆ సమయంలో వారు ఉత్తర అల్జీరియాలోని పర్వత ప్రాంతంలో తలదాచుకున్నారు. దాంతో వారిని వెంటాడి ఎన్ కౌంటర్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌లో అబ్దేల్, అల్-ఖైదాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు మరణించారని ఫ్రాన్స్ రక్షణ మంత్రి తెలిపారు.

ఫ్రెంచ్ భద్రతా దళాలు గత 7 సంవత్సరాలుగా అబ్దేల్‌మాలిక్ కోసం వెతుకుతున్నాయి. అతను ఉత్తర ఆఫ్రికాలో ఉగ్రవాదులకు పెద్ద నాయకుడుగా ఉన్నాడు. స్థానిక ఉగ్రవాదులను తన సంస్థ జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వాల్-ముస్లిమీన్ (జెఎన్ఐఎం) తో అనుసంధానించేవాడు. ఈ సంస్థ అల్-ఖైదా అనుబంధ సంస్థ. మాలి, బుర్కినా ఫాసోతో సహా చుట్టుపక్కల ప్రాంతాలలో జెఎన్‌ఐఎం భీభత్సం సృష్టించింది. ఎంతోమంది వీరి ఘాతుకానికి బలయ్యారు. అల్జీరియాలో అత్యంత భయంకరమైన ఉగ్రవాదిగా డ్రౌక్‌డెల్ పేరు గడించాడు, 1990 ప్రారంభంలో హింసాకాండకు పాల్పడటమే కాకుండా, 2007 లో అల్జీర్స్‌లోని ఐక్యరాజ్యసమితి భవనాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు.. అల్జీరియాలో జరిగిన అనేక ఘోరమైన ఆత్మాహుతి దాడులకు డ్రౌక్‌డెల్ కు చెందిన అల్ ఖైదా అనుబంధ సంస్థ సూత్రధారిగా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story