'కరోనా' బారిన పడి దావూద్ ఇబ్రహీం మరణించాడా?

కరోనా బారిన పడి దావూద్ ఇబ్రహీం మరణించాడా?

మోస్ట్ వాంటెడ్ , అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మరణించాడని ప్రచారం జరుగుతోంది. కరాచీలో COVID-19 కారణంగా దావూద్ ఇబ్రహీం కన్నుమూసినట్లు సోషల్ మీడియా సారాంశం. అయితే ఇందుకు సంబంధించి నిర్దిష్టమైన సమాచారం మాత్రం లేదు. పైగా ఇది ఎంత వరకు వాస్తవమనేది తెలియడం లేదు. అయితే దావూద్ తోపాటు అతని భార్య కరోనా బారిన పడ్డారని.. దాంతో కరాచీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు శుక్రవారం కొన్ని మీడియా నివేదికలు వచ్చాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని కూడా పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో శనివారం దావుద్ మరణించాడన్న వార్త ప్రచారంలోకి వచ్చింది.

మరోవైపు దావూద్ ఇబ్రహీం కు కరోనా సోకిందనే వార్తలను కూడా అతని సోదరుడు అనీస్ ఇబ్రహీం కొట్టిపారేశారు. దావూద్ తోపాటు అతని భార్య లేదా కుటుంబంలో మరెవ్వరూ కరోనా బారిన పడలేదని చెప్పారు. దావూద్ ప్రస్తుతం పాకిస్తాన్ , యుఎఇలలో తన వ్యాపారాన్ని నడుపుతున్నాడని చెప్పారు. అయితే అనీస్ ఎక్కడ నుండి మాట్లాడుతున్నాడన్నది తెలియలేదు. కాగా పాకిస్తాన్క లోని కరాచీలో నివసిస్తున్నట్లు భావిస్తున్న దావూద్ ఇబ్రహీం 1993 బాంబే పేలుళ్లలో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడంతోపాటు 1,300 మందికి పైగా గాయపడటానికి కారకుడిగా ఉన్నాడు.

Tags

Read MoreRead Less
Next Story