కిమ్ సోదరి హెచ్చరికలతో వెనకడుగు వేసిన దక్షిణ కొరియా

కిమ్ సోదరి హెచ్చరికలతో వెనకడుగు వేసిన దక్షిణ కొరియా
X

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్ హెచ్చరికలతో దక్షిణ కొరియా వెనకడుగు వేసింది. ఉత్తరకొరియా నుంచి దక్షిణకొరియాకు వలస వెళ్లిన పలువురు కిమ్ నియంతృత్వంపై, అణ్వాయుధాల ప్రయోగాలపై విమర్శించారు. సరిహద్దుల్లో బెలూన్లు ఎగరవేసి.. కిమ్‌ను తిడుతూ రాసిన కరపత్రాలు గాల్లోకి ఎగురవేసారు. అయితే, ఈ విషయంపై స్పందించిన కిమ్ సోదరి కిమ్ యో జాంగ్ తీవ్రంగా మండిపడ్డారు. మాతృదేశానికి ద్రోహం చేసిన ఫిరాయింపుదారులంతా సంకరజాతి కుక్కలని విరుచుకుపడ్డారు. కిమ్ ను విమర్శించిన వారిపై చర్యలు తీసుకోవాలని.. లేకపోతే.. రెండు దేశాల మధ్య కుదిరిన మిలటరీ ఒప్పందం నుంచి తప్పుకుంటామని అన్నారు. అక్కడితో ఆగకుండా.. రెండు దేశాల కలయికకు తోడ్పడుతున్న పలు వేదికలన్నింటినీ మూసివేస్తామని హెచ్చిరంచారు. దీనికి స్పందించిన దక్షిణకొరియా వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

Tags

Next Story