అంతర్జాతీయం

గోడలు లేని హోటల్.. ఒక్క రోజుకి రూ.23 వేలు..

గోడలు లేని హోటల్.. ఒక్క రోజుకి రూ.23 వేలు..
X

నాలుగు గోడల మధ్య కంటే ప్రకృతి అందాల నడుమ సేదతీరితే ఎంత బావుంటుందో కదా ఆ ఆలోచనే అన్నదమ్ములకు కలిగింది. ఆరు బయట మంచం వేసుకుని పడుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. వేప చెట్టు గాలి, వెన్నెల వెలుగులు, ఆకాశంలో నక్షత్రాలు, మదిలో కదలాడే ఊహలతో మత్తుగా నిద్రలోకి జారిపోవచ్చు. అదే పర్వత ప్రాంతాల్లో అయితే ఇంకా అద్భుతం. అందుకే స్విట్జర్లాండ్లో ఓపెన్ ఎయిర్ హోటల్ కు రూపకల్పన చేశారు సోదరులు ఫ్రాంక్, పాట్రిక్ లు డేనియల్ చార్బోన్నీర్ తో కలిసి ఆల్ప్ట్స్ పర్వతాల్లో జీరో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ప్రారంభించారు. మొత్తం ఏడు ఓపెన్ ఎయిర్ హోటళ్లను నిర్మించారు. ఈ హోటల్ లో ఒక్క రోజు బస చేస్తే 308 డాలర్లు (మన ఇండియన్ కరెన్సీలో రూ.23 వేలు). వేసవి విడిది కోసం ఈ హోటల్స్ రూపొందించామన్నారు ఫ్రాంక్, పాట్రిక్ సోదరులు ఇరువురు. స్థానికంగా ఉండే రైతులే వారికి ఫుడ్ సప్లై,రూమ్ సర్వీసింగ్ చేస్తారు. వర్షం పడితే అందుకూ తగిన ఏర్పాట్లు ముందే చేశామన్నారు.

Next Story

RELATED STORIES