బెజవాడ గ్యాంగ్‌వార్‌తో అప్రమత్తమైన పోలీసులు.. రౌడీ షీటర్స్ కదలికలపై నిఘా

బెజవాడ గ్యాంగ్‌వార్‌లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గ్యాంగ్‌వార్‌కు పెనమలూరుకు చెందిన నాగబాబు కారకుడిగా పోలీసులు గుర్తించారు. సందీప్ గ్యాంగ్‌లో కీలకమైన నాగబాబుతోపాటు మంగళగిరి రౌడీషీటర్లు కిరణ్‌కుమార్, రఘునాథ్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. గతంలో కిరణ్, రఘునాథ్‌పై మర్డర్, దోపిడి, కొట్లాట కేసులు నమోదయ్యాయి. సందీప్, పండు వర్గానికి చెందిన పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
బెజవాడ గ్యాంగ్ వార్‌తో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీపీ ద్వారక తిరుమలరావు ఆదేశాలతో కమిషనరేట్ పరిధిలో రౌడీ షీటర్స్ కదలికలపై పోలీసులు దృష్టి పెట్టారు. ప్రతి స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్ జాబితాల్ని పోలీసులు బయటకు తీస్తున్నారు. ప్రతి వారం స్టేషన్‌కి వచ్చి హాజరు కావాలని పోలీసుల ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, గ్యాంగ్ వార్, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. కమీషనరేట్ పరిధిలో శాంతిభద్రతల నేపథ్యంలో నిఘా పటిష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com