కేరళ ఏనుగు ఘటనను గుర్తు చేసిన మరో దృశ్యం

X
By - TV5 Telugu |7 Jun 2020 12:16 AM IST
కేరళలో నోట్లో బాంబు పేలి.. ఓ ఏనుగు చనిపోయిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే, ఈ ఘటన మరువక ముందే హిమాచల్ ప్రదేశ్ మరోఘటన చోటు చేసుకుంది. బిలాస్ పూర్‌లోని ఝూందూత ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నోట్లో బాంబు పేలడంతో ఆవు నోరు మొత్తం చిట్లిపోయింది. నోటి నుంచి తీవ్రంగా రక్తం కారుతోంది. ఈ ఘటనపై యజమాని గురుదయాల్ సింగ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటి పక్కనే ఉన్న నందాలాల్ అనే వ్యక్తే దీనికి కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

