విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై హైపవర్ కమిటీ భేటీ

X
By - TV5 Telugu |7 Jun 2020 3:27 AM IST
విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై హైపవర్ కమిటీ భేటీ కొనసాగుతోంది. అటవీ పర్యావరణశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ నేతృత్వంలో సమావేశం జరుగుతోంది. ఇందులో కమిటీ సభ్యులు పరిశ్రమలశాఖ కార్యదర్శి కరికాల వలవన్, విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, సీపీ ఆర్కే మీనా పాల్గొన్నారు.
ఏయూ పర్యావరణ నిపుణులతో కమిటీ చర్చించనుంది. అలాగే ప్రమాద ఘటనపై వివిధ కమిటీ నివేదికలపై హైపవర్ కమిటీ అధ్యయనం చేయనుంది. రాజకీయ, పర్యావరణవేత్తల నుంచి సూచనలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామాల్లోనూ హైపవర్ కమిటీ పర్యటించనుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

