జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి మందు లారీ ఓనర్లు ధర్నా

X
మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తమను మోసం చేశారంటూ.. లారీ ఓనర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. BS-3 వాహనాలను BS-4 గా మార్చి తమకు విక్రయించారని మాజీ ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నాకు దిగారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వద్ద తాము కొనుగోలు చేసిన లారీలను రవణా శాఖా అధికారులు సీజ్ చేశారని అన్నారు. ఎందుకు సీజ్ చేస్తున్నారని ప్రశ్నించగా.. BS-3 వాహనాలను BS-4 పేరుతో అక్రమ రిజిస్ట్రేషన్ చేసినట్టు చెప్పారని.. లారీ ఓనర్లు వాపోయారు. లారీలు సీజ్ చేయండంతో తాము అప్పుల్లో కూరుకుపోయామని.. తమకు న్యాయం చేయకపోతే భార్యాపిల్లలతో సహా జేసీ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటామని కన్నీటిపర్యంతమయ్యారు. ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు.. లారీ ఓనర్లను అదుపులోకి తీసుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
