తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆస్పత్రుల దోపిడీలకు అడ్డుకట్ట

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆస్పత్రుల దోపిడీలకు అడ్డుకట్ట
X

కరోనాపై యుద్ధంలో తమిళనాడు ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. కేసులు విపరీతంగా పెరుగుతుండటం.. ప్రైవేటు ఆస్పత్రులు సామాన్యుల జేబుకు చిల్లు పెడుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైద్యానికి వేసే బిల్లులపై గరిష్ట పరిమితిని ప్రకటించింది. రెండు కేటగిరీలుగా ప్రైవేటు ఆస్పత్రులను విభజిస్తూ నిర్ణయం తీసుకుంది.. మొదటి కేటగిరీలో గ్రేడ్‌ ఏ1, ఏ2 ఆస్పత్రులు.. రెండో కేటగిరీలో ఏ3, ఏ4 ఆస్పత్రులు ఉన్నాయి.. సాధారణ బెడ్‌కు ఏ1, ఏ2 కేటగిరీ ఆస్పత్రుల్లో రోజుకు 7,500కు మించరాదని నిబంధన విధించింది.. ఇక ఏ3, ఏ4 గ్రేడ్‌ ఆస్పత్రుల్లో రోజుకు 5వేలు గరిష్ట పరిమితి విధిస్తూ నిర్ణయం తీసుకుంది.. ఐసీయూ బెడ్‌కు ఆస్పత్రిలో రోజుకు 15వేల రూపాయలు మించకూడదని నిబంధన విధించింది తమిళనాడు ప్రభుత్వం.

Tags

Next Story