కడప జిల్లాలో డ్రైవర్‌తో పాటు అగ్నికి ఆహుతైన సిమెంట్ లారీ

కడప జిల్లాలో ఓ సిమెంట్ లారీ అగ్నికి ఆహుతైంది. ఆ మంటల్లో చిక్కుకుని డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. అగ్నికీలలు పెద్ద ఎత్తున ఎగిసిపడడంతో.. లారీ డ్రైవర్‌ను కాపాడేందుకు స్థానికులు సాహసించలేకపోయారు. అగ్నిమాపక దళం వచ్చే సరికి అతని ప్రాణాలు పోయాయి. డ్రైవర్‌ను రసూల్‌గా గుర్తించారు. అతడిని తమిళనాడులోని తిరుమల్లూరు జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు.
కర్నూలు జిల్లా రాచర్ల నుంచి సిమెంట్ లోడుతో చెన్నైకి బయల్దేరిన లారీ.. కడప జిల్లా దువ్వూరు మండలంలో ప్రమాదానికి గురైంది. డివైడర్‌ను వేగంగా ఢీ కొట్టింది. దీంతో లారీ తిరగబడింది. వెంటనే ఇంజిన్ నుంచి మంటలు రాజుకున్నాయి. క్షణాల వ్యవధిలో ఎగిసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో లారీ డ్రైవర్ రసూల్ ప్రాణాలు కోల్పోయాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

