ఏపీ‌లో చెక్ పోస్టులు ఎత్తివేత లేదు : రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి

ఏపీ‌లో చెక్ పోస్టులు ఎత్తివేత లేదు : రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి
X

అంతర్రాష్ట్ర బార్డర్ చెక్‌పాయింట్‌‌లను సోమవారం నుంచి ఎత్తివేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆంధ్రప్రదేశ్‌ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, కోవిడ్‍ టాస్క్ ఫోర్స్ చైర్మన్‍ కృష్ణబాబు అన్నారు. కోవిడ్ 19 మార్గదర్శకాల ప్రకారం సరిహద్దు చెక్‌పాయింట్లలన్నీ లాక్‌డౌన్‌ ఎత్తివేసేంతవరకూ కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఏపీకి రావాలి అనుకునే వారు ఖచ్చితంగా ‘స్పందన’ వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సిందేనని ఆయన తెలిపారు.

కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ఆరు రాష్ట్రాల మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఏడు రోజులపాటు ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉండాలని కృష్ణబాబు చెప్పారు. తెలంగాణకు ఆర్టీసీ బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామన్న కృష్ణబాబు.. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పష్టత రావలసి ఉందని అన్నారు.

Tags

Next Story