కరోనా కాటుకు బలైన మహిళ.. అక్కడ పెరిగిన మరణాల సంఖ్య

కరోనా కాటుకు బలైన మహిళ.. అక్కడ పెరిగిన మరణాల సంఖ్య
X

కోవిడ్ -19 మహమ్మారి ఉదృతి పంజాబ్‌లో కొనసాగుతూనే ఉంది. ఈ ప్రమాదకరమైన వైరస్ కారణంగా ఆదివారం జలంధర్ కు చెందిన మహిళ ఒకరు మరణించారు. దిల్‌బాగ్ నగర్ కు చెందిన ఈ మహిళ కొద్ది రోజులుగా లుధియానాలోని డిఎంసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే దురదృష్టవశాత్తు ఆమె ఆదివారం మరణించారు. దీంతో పంజాబ్‌లో మరణాల సంఖ్య 56కు చేరింది, అలాగే జలంధర్‌లో 10కి పెరిగింది.

ఆదివారం జలంధర్ జిల్లాలో ఒక మరణం తోపాటు, మరో 12 మందికి కోవిడ్ -19 సంక్రమణ ఉన్నట్లు నిర్ధారించారు. ఇందులో రోజ్ గార్డెన్ , లామా పిండ్, ప్రీత్ నగర్, భార్గవ్ క్యాంప్ లాడోవాలి రోడ్ లలో కరోనా కేసులను గుర్తించారు. ఇవే కాకుండా, అమృత్సర్‌లో 14 మంది, బర్నలాలో 4, లూధియానాలో 7, గురుదాస్‌పూర్‌లో 3, ఫరీద్‌కోట్‌లో 3, పఠాన్‌కోట్‌లో ఇద్దరికీ కరోనా ఉన్నట్లు నివేదించారు. తాజా కేసులతో లూధియానా జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 300 కు పెరిగింది. రాష్ట్రంలో అత్యధికంగా సోకిన జిల్లా అమృత్సర్ లో మొత్తం పాజిటివ్ రోగుల సంఖ్య 482 కి చేరుకుంది. ఇందులో 346 మంది రోగులు కోలుకొని ఇంటికి వెళ్లారు, 8 మంది మరణించారు, 128 మంది వివిధ ఆసుపరులలో చికిత్సలో ఉన్నారు.

Tags

Next Story