కన్నడ నటుడు చిరంజీవి సర్జా కన్నుమూత

కన్నడ నటుడు చిరంజీవి సర్జా కన్నుమూత
X

కన్నడ నటుడు చిరంజీవి సర్జా అకాలమరణం చెందారు. ఆయన వయసు 39 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నచిరంజీవి సర్జా ఆదివారం బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చిరంజీవి సర్జా కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆసుపత్రిలో చేరారు.. అయితే దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ చిరంజీవి సర్జా మరణించాడని కుటుంబ సభ్యులు చెప్పారు. కాగా మృతదేహం నుంచి కరోనా పరీక్షల కోసం నమూనాలను సేకరించారు.

1980 అక్టోబరు 17న బెంగళూరులో జన్మించిన చిరంజీవి సర్జా కెరీర్‌ మొదట్లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా తన సినీ కెరీర్ ను ఆరంభించారు. ఆ తర్వాత నటుడిగా మారి 2009లో ‘వాయుపుత్ర’ అనే చిత్రంతో హీరోగా చేశారు. ‘ఆకే’, ‘సింగా’, ‘సంహారా’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన చిరంజీవి సర్జా యాక్షన్‌ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు ఆయన 19 సినిమాల్లో హీరోగా నటించారు. సోమవారం ఉదయం చిరంజీవి సర్జా స్వగ్రామం తుమకూరు జిల్లా మధుగిరి తాలూకా జక్కేనహళ్లిలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు వెల్లడించారు. ఇక చిరంజీవి సర్జా మరణం పట్ల టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్ సంతాపం తెలిపారు.

Tags

Next Story