నటి చందన ఆత్మహత్య కేసు.. ప్రియుడు అరెస్ట్‌

నటి చందన ఆత్మహత్య కేసు.. ప్రియుడు అరెస్ట్‌
X

కన్నడ టీవీ నటి చందన ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఆమె ప్రియుడు దినేశ్‌ను ఆదివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. 29 ఏళ్ల చందన గత సోమవారం విషం సేవించారు.. దాంతో ఆమెను బెంగళూరులోని ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందక ముందే ఆమె తుది శ్వాస విడిచింది. తన ప్రియుడు దినేష్ తనను వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకున్న వీడియోను రికార్డ్ చేసి, తన ప్రియుడు, అతని కుటుంబానికి పంపినట్లు తెలిసింది. చందన తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పరారీలో ఉన్న దినేశ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Tags

Next Story