పేదల ఇంటి స్థలాల పేరుతో వైసీపీ నాయకుల అక్రమ వసూళ్లు : ఎమ్మెల్యే నిమ్మల

పేదల ఇంటి స్థలాల పేరుతో వైసీపీ నాయకుల అక్రమ వసూళ్లు : ఎమ్మెల్యే నిమ్మల
X

పేదల ఇంటి స్థలాల పేరుతో వైసీపీ నాయకులు అక్రమ వసూళ్లకు పాల్పడుతుంటే... అవినీతి జరుగడంలేదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. ఇంటి స్థలాల కొనుగోళ్లకోసం తమ నియోజకవర్గంలో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై సాక్షాత్తు నరసాపురం ఎంపి రఘురామ కృష్ణమరాజు కలెక్టర్ కు ఫిర్యాదుచేయడం వాస్తవం కాదా అని నిమ్మల ప్రశ్నించారు. వసూళ్లకు పాల్పడుతున్న వైసీపీ నాయకుడిని సస్పెండ్ చేయలేదా అన్నారు. ఈ వసూళ్ల వెను ఉన్న బడా బాబులు ఎవరో విచారణ చేపట్టాలని నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. స్థల పూడిక పనులల్లో ఎక్కడా లేని రేట్లు పెంచి భారీ అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

Tags

Next Story