ఒక్క కరోనా కేసూ లేదు.. సంతోషంతో డ్యాన్స్ చేసిన ప్రధాని

50 లక్షల జనాభా.. అయినా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. కరోనాని సమర్ధవంతంగా ఎదుర్కొంది.గత 17 రోజులుగా ఒక్క పాజిటివ్ కేసూ నమోదు కాకపోవడంతో లాక్డౌన్ ఎత్తివేసింది న్యూజిలాండ్ దేశం. ప్రధాని జసిండా అర్డర్న్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ న్యూజిలాండ్ ను కరోనా ఫ్రీ దేశంగా ప్రకటిస్తున్నట్లు చెప్పారు. హ్యాపీగా ఎంతమందైనా కలిసి తిరిగేయండి.. భౌతిక దూరాన్ని అస్సలు పాటించక్కర్లేదని చెప్పారు. అయితే దేశ సరిహద్దుల వద్ద మాత్రం ఆంక్షలు యధావిధిగా కొనసాగుతాయని ఆమె అన్నారు.
కాగా, ఆ దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలు 1154, మరణించిన వారి సంఖ్య 22. కేసులు లేవని తెలిసిన వెంటనే ప్రధాని తన ఛాంబర్ లో డ్యాన్స్ చేశారని మీడియా పేర్కొంది. కరోనాని విజయవంతంగా ఎదుర్కున్న న్యూజీల్యాండ్ లో ఇక నుంచి నైట్ క్లబ్ లు, థియేటర్లు తెరుచుకుంటాయి. క్రీడా ప్రాంగణాలు కూడా పరిమితులకు లోబడి తెరుచుకుంటాయి. విస్తృత స్థాయిలో, ప్రధాని ఆంక్షలను సడలించడం న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థకు సహాయపడుతుందని పలువురు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేము ఆర్థిక పురోగతి వైపు దృష్టి సారిస్తామని ప్రధాని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

