నేటినుంచి తెరుచుకోనున్న ఆలయాలు.. కానీ..

నేటినుంచి తెరుచుకోనున్న ఆలయాలు.. కానీ..
X

లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా మూతపడిన ఆలయాలు కేంద్ర ప్రభుత్వ సడలింపుల్లో భాగంగా ఇవాళ్టి నుంచి తెరచుకుంటున్నాయి. కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం దేశంలోని ప్రధాన ఆలయాల్లో భక్తులకు దర్శనానికి అనుమతిస్తున్నారు. దీంతో పలు రాష్ట్రాల్లోని ఆలయాలకు భక్తులు క్యూకట్టారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే... భక్తుల దర్శనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో సుధీర్ఘ విరామం తరువాత ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి.

మళ్లీ దేవాలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెళ్లివిరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాల్లోను భక్తుల సందడి నెలకొంది. ప్రముఖ దేవాలయం తిరుమలలోను శ్రీవారి దర్శనానికి సర్వం సిద్ధం చేసింది టీటీడి. ప్రసిద్దం పుణ్యక్షేత్రం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇవాళ్టినుంచి మూడురోజులపాటు టీటీడి సిబ్బంది, స్థానిక భక్తులకు దర్శనానికి అనుమతి ఇచ్చి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. 11 నుంచి సాధారణభక్తుల దర్శనానికి అనుమతి ఇస్తారు. లాక్ డౌన్ కంటే ముందు రోజుకు 50 వేలనుంచి లక్షమంది భక్తులు స్వామివారిని దర్శించుకునేవారు. అయితే ఇప్పుడు మాత్రం ప్రతిరోజు కేవలం 6వేలమంది భక్తులకు మాత్రమే అనుమతివ్వనున్నారు. అలిపిరి టోల్ గేట్ వద్ద థర్మల్ స్క్రీనింగ్, వెహికిల్ స్కానింగ్, హ్యాండ్ సానిటైజర్లు ఏర్పాటుచేసి ప్రతి ఒక్కరినిపరీక్షించిన తర్వాతే అనుమతి ఇస్తున్నారు. ఆన్ లైన్ టికెట్లు ఉన్నవారిని మాత్రమేదర్శనానికి అనుమతి ఇస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలప్రకారం ఇప్పటికే తెలంగాణాలోని ప్రధాన ఆలయాల్లో భక్తుల దర్శనానికి అన్నిఏర్పాట్లు చేశారు అధికారులు. తెలంగాణలో ప్రధాన ఆలయాలైన భద్రాద్రి సీతారామచంద్ర స్వామి ఆలయం, యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాల్లో ఇవాళ్లి నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆలయాల్లో తీర్థప్రసాదాలు, శఠగోపాలు ఉండవని.. ఎలాంటి వసతి సదుపాయం కల్పించడం లేదని స్పష్టం చేశారు.

యాదాద్రిలక్ష్మినర్సింహస్వామి ఆలయంలో భక్తుల దర్శనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ మొదటిరోజు ఆలయ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, స్థానికులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఉదయం 1 0గంటల నుంచి 11 గంటల వరకు బ్రేక్ దర్శనాలు ఉంటాయి. అయితే దర్శనానికి వచ్చే భక్తులు తప్పని సరిగా వారి ఆధార్ కార్డు తీసుకురావాల్సి ఉంటుంది. మంగళవారం నుంచి సాధారణ భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. ఉచిత, లఘు దర్శనాలను కూడా కల్పించనున్నారు. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు గోత్రనామాలతో పూజలు చేయిస్తామంటున్నారు ఆలయ అధికారులు. కరోనా నేపథ్యంలో తలనీలాలను కళ్యాణ కట్టను తాత్కాలికంగా మూసివేశారు. కౌంటర్ల ద్వారాప్రసాదాలను విక్రయించనున్నారు. ఇక యాదాద్రికొండ పైకి పరిమిత సంఖ్యలో వాహనాలకు అనుమతి ఇవ్వనున్నారు.

రెండు నెలల తర్వాత భద్రాద్రి ఆలయం ఇవాళ తెరుచుకుంది. థర్మల్ స్క్రీనింగ్ అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. ఉదయం 6 గంటల 30 నిమిషాల నుండి 11 గంటల 30 నిమిషాల వరకకు భక్తులకు సీతారాముల దర్శనానికి అనుమతి ఇస్తారు. తిరిగి మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6 గంట 30 నిమిషాల వరకు భక్తులు దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లుచేశారు. ఇన్నాళ్లు భక్తులులేక నిర్మానుష్యంగా మారిన ఆలయం.. ఇక భక్తులతో కళకలలాడనుంది. ఆలయానికి వచ్చిన ప్రతిఒక్క భక్తుడికి దర్శనం చేయిస్తామంటున్నారు అధికారులు.

Tags

Next Story