తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులకు రాజధాని నిరసనల సెగ

తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులకు రాజధాని నిరసనల సెగ

రాజధాని అమరావతికి సినిమా ఇండస్ట్రీ పెద్దలు మద్దతు తెలపాలని ఆ ప్రాంత ప్రజలంతా డిమాండ్ చేస్తున్నారు. సీఎం జగన్‌ను కలిసేందుకు అమరావతి వచ్చిన చిరంజీవి సహా పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు తమతో కలిసి రావాలని కోరుతున్నారు. ప్రస్తుతం సినీ ప్రముఖులు బస చేసిన గెస్ట్ హౌస్ బయట కొందరు అమరావతి JAC ప్రతినిధులు నిరసనకు దిగారు. టాలీవుడ్ సమస్యలపై వారంతా సీఎంను కలవడం సంతోషమేనని.. రాజధాని కోసం 175 రోజలుగా రైతులు చేస్తున్న తమ ఉద్యమానికి కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. స్టూడియోల నిర్మాణం కోసం ఏపీలో భూములు కావాలి కానీ.. రాజధాని సమస్య ఇండస్ట్రీ పెద్దలకు పట్టదా అని రైతుల ప్రశ్నిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story