కలెక్టర్ మేడం చాలా మంచి వారు: సౌదీ మహిళ

కలెక్టర్ మేడం చాలా మంచి వారు: సౌదీ మహిళ

బంధువుల్ని చూద్దామని వచ్చాను. ఇక్కడ బంధీ అయిపోయాను. మా దేశం వెళ్లిపోతాను పంపించండమ్మా అని సౌదీ మహిళ హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతిని రిక్వెస్ట్ చేశారు. దాంతో ఆమె వెంటనే స్పందించారు. సౌదీ అరేబియాకు చెందిన 54 ఏళ్ల ముస్లిం మహిళ తన బంధువులను కలిసేందుకు జనవరి 31న హైదరాబాద్ వచ్చారు. ఏప్రిల్ 17న తిరిగి సౌదీ వెళ్లేందుకు టిక్కెట్ కూడా బుక్ చేసుకున్నారు. అనుకోకుండా లాక్డౌన్ వచ్చిపడింది. దాంతో అంతర్జాతీయ విమాన సర్వీసులూ బంద్ అయ్యాయి. సౌదీ మహిళ ప్రయాణం ఆగిపోయింది.

కాగా, లాక్డౌన్ సడలించడంతో తిరిగి ఆమె తమ దేశం వెళ్లేందుకు కోవిడ్ టెస్టులు, క్లియరెన్స్ సర్టిఫికెట్లు కావల్సి వచ్చాయి. దీంతో ఆమె హైదరాబాద్ లోని రాయల్ కాన్సులేట్ ప్రతినిధి, న్యాయవాది మహమ్మద్ ఉస్మాన్ ని సంప్రదించారు. ఆయన వెంటనే స్పందించి సౌదీ మహిళ స్వదేశం వెళ్లేందుకు సత్వర పరీక్షల కోసం సహకరించాలని ఈ-మెయిల్ ద్వారా కలెక్టర్ ను కోరారు. స్పందించిన కలెక్టర్ ఆమెకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ జారీ చేసే విధంగా వైద్య శాఖ అధికారులను ఆదేశించారు.

ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలతో వైద్యాధికారులు సౌదీ మహిళకు ఒక్క రోజులోనే పరీక్షలు నిర్వహించి రిపోర్టులు అందించారు. కొవిడ్ పరీక్షల్లో నెగిటివ్ రావడంతో తిరిగి సౌదీ వెళ్లేందుకు లైన్ క్లియర్ అయింది. దీంతో ఆమె సోమవారం ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి సౌదీ కి ప్రయాణమైంది. ఈ సందర్భంగా సౌదీ మహిళ మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ మేడం చాలా మంచి వారు. నా బాధను అర్ధం చేసుకుని నాకు తక్షణ సహాయం చేశారని పేర్కొంది.

Tags

Next Story