ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు నేడు కరోనా పరీక్షలు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కరోనా లక్షణాలు కనిపించడంతో ఐసోలేషన్ కు వెళ్లారు. జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్న ఆయన ఇవాళ కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోనున్నారు. లక్షణాలు కనిపించడంతో ఆయన తన కార్యక్రమాలన్ని రద్దుచేసుకొని ముందు జాగ్రత్త చర్యగా ఐసోలేషన్ కు వెళ్లారు. ఇవాళ నిర్వహించే టెస్టుల్లో ఆయనకు వైరస్ సోకిందా లేదా అనేది తేలనుంది. ఢిల్లీలో ఏకంగా ముఖ్యమంత్రికే వైరస్ సోకడంతో అధికారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇకసామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
అయితే ఢీల్లీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఒక్క రోజే కొత్తగా వెయ్యి కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కేసులు సంఖ్య 30వేలకు చేరుకుంది. 874 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. 11వేల 357మంది వైరస్ బారినుంచి కోలుకొని డిచ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసులుసంఖ్య 17వేలు దాటింది.
దేశంలో మరణాల సంఖ్య 7,135కు చేరుకుంది. మహారాష్ట్రలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. కరోనా కేసుల విషయంలో మహారాష్ట్ర చైనాను దాటిపోయింది. మహారాష్ట్రలో 85వేల 975 కేసులు నమోదయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com