నేడు కువైట్ నుంచి ఇండోర్ కు 133 మంది భారతీయులు

నేడు కువైట్ నుంచి ఇండోర్ కు 133 మంది భారతీయులు
X

లాక్డౌన్ సమయంలో కువైట్ లో చిక్కుకున్న 133 మంది భారతీయులు నేడు స్వదేశానికి చేరుకోనున్నారు. కువైట్ నుండి ఢిల్లీ మీదుగా మంగళవారం ఇండోర్‌కు ఫ్లైట్ రానుంది. ఇందులో మొత్తం 133 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో 50 మంది ప్రయాణికులు ఇండోర్‌ కు చెందిన వారు కాగా. మిగిలిన వారు రాష్ట్రంలోని వివిధ నగరాలకు చెందినవారు. కువైట్ నుండి రాత్రి 8.45 గంటలకు విమానం ఇండోర్‌కు వస్తుందని విమానాశ్రయం డైరెక్టర్ అరిమా సన్యాల్ తెలిపారు. ప్రయాణీకులందరికి ఇండోర్ విమానాశ్రయంలోనే పరీక్షలు చేసి నిర్బంధిస్తారని సమాచారం.

Tags

Next Story