వ్యక్తి ప్రాణాలు తీసిన ఉల్లి

వ్యక్తి ప్రాణాలు తీసిన ఉల్లి
X

ఉల్లిపాయ ప్రాణాలు తీసింది. ఉల్లిగడ్డల కోసం జరిగిన గొడవలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కడప జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. కడప మున్సిపల్ మైదానంలో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేశారు. ఉల్లిపాయల గురించి మహమ్మద్ ఇజాజ్, సబ్దార్ మధ్య గొడవ జరిగింది. అది కాస్తా చినికిచినికి గాలివానగా మారి కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ కొట్లాట లో మహ్మద్ ఇజాజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో గుండెపోటు కూడా వచ్చింది. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూనే మహమ్మద్ ఇజాజ్ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు .

Tags

Next Story