ప్రముఖ సినీ నటుడు మురళి శర్మ ఇంట్లో విషాదం

ప్రముఖ సినీ నటుడు మురళి శర్మ ఇంట్లో విషాదం

ప్రముఖ టాలీవుడ్ నటుడు మురళీ శర్మ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. వెండితెరపై విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మురళీ శర్మ. ఆయన మాతృమూర్తి అకస్మికంగా మృతి చెందారు. మురళీ శర్మ తల్లి శ్రీమతి పద్మ శర్మ ఆదివారం రాత్రి ముంబైలోని ఆమె సొంత ఇంట్లో కన్నుమూశారు. 76 ఏళ్ల పద్మ శర్మ ఆరోగ్య సమస్యలతో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మురళి శర్మ కుటుంబానికి పలువురు సెలబ్రెటీలు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మురళి శర్మ ఇటీవల కాలంలో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. విలన్‌గా, తండ్రిగా, పోలీస్ ఆఫీసర్‌గా అనేక పాత్రల్లో నటించి మెప్పించారు. మహేష్ బాబు హీరోగా నటించిన ‘అతిథి’ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు. తొలి మూవీతోనే ఉత్తమ విలన్‌గా నంది అవార్డు అందుకున్నారు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దక్షిణాదితో పాటు హిందీలో వందకు పైగా చిత్రాల్లో నటించారు.

Tags

Read MoreRead Less
Next Story