మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఫైర్

మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఫైర్

తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి ఫైరయ్యారు. జన్వాడ గ్రామంలో కేటీఆర్‌కు 2 ప్రాంతాల్లో భూములున్నాయని ఆరోపించారు. పోలీసులు కూడా ఈ మేరకు కోర్టుకు నివేదిక ఇచ్చారని, కేటీఆర్ కూడా తన ఎన్నికల అఫిడవిట్‌లో స్వయంగా పేర్కొన్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 2019 మార్చ్ 7వ తేదీన 301వ సర్వే నెంబర్‌లో రెండు ఎకరాల భూమి కేటీఆర్, ఆయన భార్య పేరుమీద రిజిస్టర్ అయ్యిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫామ్‌ హౌస్ నిర్మించుకున్నారని తెలిపారు. తన ఆరోపణల్లో ఒక్క శాతం తప్పున్నా ఏ శిక్షకైనా సిద్దమని సవాల్ విసిరారు.

Tags

Read MoreRead Less
Next Story