5 రూపాయిల చిల్లర కోసం తుప్పు పట్టిన బుర్రలకు పని : నారా లోకేశ్

X
వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మ్యాటర్ వీక్ అనే విషయం పేటిఎమ్ బ్యాచ్ కి అర్థం అయిపోయిందని.. అందుకే 5 రూపాయిల చిల్లర కోసం తుప్పు పట్టిన బుర్రలకు పనిపెట్టారని విమర్శించారు.
టీడీపీ అధ్యక్షుడి ఎంపికలో నాయకుల మధ్య వివాదం అంటూ ఫేక్ అకౌంట్లు సృష్టించి రచ్చ చేస్తున్నారని.. అన్నదమ్ముల్లా ఉన్న తనకు, ఎంపీ రామ్మోహన్ నాయుడుకు మధ్య గొడవలు పెట్టాలని ప్రయాస పడుతున్నారన్నారు. టీడీపీలో ప్రతి కార్యకర్తా అధ్యక్షుడితో సమానమే అన్న లోకేశ్.. ఇలాంటి ప్రయత్నాలు టీడీపీ నాయకుల మధ్య బంధాన్ని మరింత బలపరుస్తున్నాయని గుర్తుచేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
