రోగుల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉంది : బాలకృష్ణ

రోగుల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉంది : బాలకృష్ణ

సినీనటుడు బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలను హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రిలో ఘనంగా జరుపుకున్నారు. 60 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని చెప్పారు. తండ్రి ఎన్టీఆర్ స్పూర్తితో ముందుకు వెళ్తున్నానని.. తన తల్లి బసవ తారకం పేరుమీద ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిని 500 పడకల ఆసుపత్రిగా సేవలు అందిస్తున్నామని చెప్పారు. క్యాన్సర్ రోగుల సమక్షంలో తన జన్మదిన వేడుకలను జరుపుకోవడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. రాబోయే కాలంలో కరోనా విజృంభించే అకాశం ఉందని.. అందరూ స్వీయ నియంత్రణ పాటించాలని తప్పక పాటించాలని బాలయ్య సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story