బాబాయ్.. నా మొదటి హీరో మీరే: జూనియర్ ఎన్టీఆర్ విషెస్

బాబాయ్.. నా మొదటి హీరో మీరే: జూనియర్ ఎన్టీఆర్ విషెస్

నందమూరి నట నాయకుడు బాలకృష్ణకి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బాబాయ్ కి విషెస్ చెప్తూ అబ్బాయి ఈ విధంగా ట్వీట్ చేశాడు.. నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే.. నాకు ఊహ తెలిశాక చూసిన మొట్ట మొదటి హీరో మీరే. ఈ 60వ పుట్టిన రోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఏ వెరీ హ్యాపీ 60 బర్త్ డే బాబాయ్. జై బాలయ్య అని ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

కళ్యాణ్ రామ్ కూడా బాబాయ్ కి శుభాకాంక్షలు తెలిపారు. నాకు మాత్రం తండ్రి తరువాత తండ్రి స్థానంలో ఉండే బాబాయ్. మీ స్ఫూర్తితోనే నేను సినిమాల్లోకి వచ్చాను. మీరే నాకు ఆదర్శం .. ఈ 60వ పుట్టిన రోజున మీరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.. హ్యాపీ బర్త్ డే బాబాయ్ అని తెలిపారు.

ప్రతి ఒక్కరినీ వినయ విధేయలతో పలకరించే గౌరవనీయమైన వ్యక్తి మీరు. మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. హ్యాపీ బర్త్ డే లయన్ అని నారా రోహిత్ తెలిపారు.

లయన్ కింగ్ ఆఫ్ తెలుగు సినిమా, నందమూరి నటసింహ బాలకృష్ణ గారికి, ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అందజేయాలని కోరుకుంటున్నాను. మీ 60వ బర్త్ డే మళ్లీ స్వీట్ సిక్స్ టీన్ నుంచి కౌంట్ రీస్టార్ట్. షష్టిపూర్తి జన్మదిన శుభాకాంక్షలు అని ప్రసాద్ విపొట్లూరి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story