ఈ ఏడాది బోనాల జాతర రద్దు : మంత్రి తలసాని

ఈ ఏడాది బోనాల జాతర రద్దు : మంత్రి తలసాని
X

ఆషాఢంలో ప్రతీఏటా హైదరాబాద్‌లో ఎంతో వైభవంగా బోనాల పండుగ వేడుకల్ని నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది బోనాల పండుగను రద్దు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో బోనాల పండుగను రద్దు చేస్తున్నట్లు తలసాని పేర్కొన్నారు.

బోనాల పండుగ నిర్వహణపై నగర మంత్రులు బుధవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈ సంవత్సరం బోనాల జాతరను రద్దు చేస్తున్నట్టు మంత్రి తలసాని ప్రకటించారు. అయితే ఆలయాల్లో పూజరులు మాత్రమే బోనాలు నిర్వహిస్తారని తెలిపారు. ప్రజలు మాత్రం ఎవరి ఇంట్లో వారే బోనాలు జరుపుకోవాలని తెలిపారు. గటాల ఊరేగింపు కూడా పూజారులే దేవాలయ పరిసరాల్లో ఉరేగిస్తారని పేర్కొన్నారు. అమ్మవార్లకు పట్టు వస్త్రాలు కూడా పూజరులే సమర్పిస్తారన్నారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరుతున్నామని మంత్రి తలసాని పేర్కొన్నారు.

Tags

Next Story