అంతర్జాతీయం

coronavirus : తీవ్ర విమర్శలతో దిగివచ్చిన బ్రెజిల్ ప్రభుత్వం.. డేటా విడుదల

coronavirus : తీవ్ర విమర్శలతో దిగివచ్చిన బ్రెజిల్ ప్రభుత్వం.. డేటా విడుదల
X

ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు రావడంతో బ్రెజిల్ ప్రభుత్వం దిగివచ్చింది. మొన్నటిదాకా కరోనా కేసులు, మరణాలను బయటికి చెప్పకూడదనుకున్న బ్రెజిల్.. విమర్శల పర్వంతో తీరుమార్చుకుంది. బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఐదు రోజుల తరువాత కొత్త ఇన్ఫెక్షన్ డేటాను విడుదల చేసింది. అయితే ఒకరు డేటాను మాత్రమే ఇచ్చింది. సోమవారం 15 వేల 654 కేసులు నమోదయ్యాయని సమాచారం ఇచ్చింది.

దీంతో మొత్తం 7 లక్షల 7 వేల 412 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 679 మరణాలు కూడా నమోదయ్యాయని.. ఇప్పుడు ఈ సంఖ్య 37 వేల 134 కు పెరిగిందని పేర్కొంది. కాగా జూన్ 4 తరువాత బ్రెజిల్ సరైన గణాంకాలను ఇవ్వలేదని ఆదివారం అమెరికన్ మరియు స్థానిక మీడియా నివేదికలు వచ్చాయి. దీంతో పలు దేశాలు ఈ చర్యను ఖండించాయి.. ఒక సామాజిక సంస్థ కూడా బ్రెజిల్ లో నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. దీంతో ఎట్టకేలకు దిగివచ్చిన బ్రెజిల్ సోమవారం డాటాను ప్రపంచం ముందుంచింది.

Next Story

RELATED STORIES