మా బాలకృష్ణకు షష్టి పూర్తి శుభాకాంక్షలు: మెగాస్టార్

మా బాలకృష్ణకు షష్టి పూర్తి శుభాకాంక్షలు: మెగాస్టార్

నందమూరి నటసింహం బాలక‌ృష్ణ బుధవారం తన 60వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. బాలయ్యకు పలువురు రాజకీయ, సినిమా ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగస్టార్ చిరంజీవి బాలకృష్ణకు ట్విటర్ వేదికగా బర్తడే విషెస్ తెలిపారు. "60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు. ఇదే ఉత్సాహంతో ,ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని, అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను" అని చిరంజీవి ట్వీట్ చేశారు. అటు, మోహన్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కూడా బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. బాలకృష్ణ అభిమానులు కూడా మంచి ఉత్సాహంలో ఉన్నారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం నుంచి తన పుట్టిన రోజు కానుకగా సినీ ప్రేక్షకులకు ఓ నిన్న విడుదల చేసిన టీజర్ కు మంచిస్పందన రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story