యజమాని ఆత్మహత్య చేసుకున్న చోట కన్నీళ్లతో ఎదురుచూస్తున్న శునకం

యజమాని ఆత్మహత్య చేసుకున్న చోట కన్నీళ్లతో ఎదురుచూస్తున్న శునకం

తమలో ఉండే విశ్వాసం మరే జీవిలో ఉండదని మరోసారి నిరూపించింది ఓ శునకం. ప్రస్తుతం చాల మంది శునకాలను అల్లారు ముద్దుగా సొంత బిడ్డలా పెంచుకుంటున్నారు. దీంతో యజమానుల పట్ల శునకాలు ఎంతో ప్రేమ ఆప్యాయతగా ఉంటున్నాయి. యజమాని దూరమయితే ఆ శునకం ఎంతో బాధను అనుభవిస్తూ ఉంటుంది. తాజాగా చైనాలో జరిగిన ఓ ఘటన అందరికీ హృదయాలను కలచివేస్తుంది.

ఓ శునకాన్ని యజమాని ఎంతో ఆప్యాయంగా పెంచుకున్నాడు. దీంతో శునకానికి యజమానికి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. చైనాలో మే 30న తన పెంపుడు శునకం ఎదుటే వంతెన పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి తన యజమాని తిరిగి వస్తాడని.. ఆ బ్రిడ్జి వద్ద రోజు ఎదురు చూస్తుంది శునకం. యజమాని చనిపోయాడని తెలియక, తన కోసం వస్తాడని కన్నీళ్లతో ఎదురు చూస్తోంది. ఆ శునకం బాధ చూడలేని మరో వ్యక్తి.. తన వెంట తీసుకెళ్లాడు. అయితే ఆ శునకం అతని దగ్గర నుంచి తప్పించుకొని వచ్చి.. మళ్లీ ఆ బ్రిడ్జి దగ్గర తన యజమాని కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. ఈ విషయం తెలిసిన ఆ వ్యక్తి శునకాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.

Tags

Read MoreRead Less
Next Story