స్కీమ్‌ల పేరుతో స్కామ్‌లు : చంద్రబాబు

స్కీమ్‌ల పేరుతో స్కామ్‌లు : చంద్రబాబు
X

పార్టీ ప్రజాప్రతినిధులు, ఇంఛార్జ్‌లతో ఆన్‌లైన్‌లో సమావేశమయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ... వైసీపీ సర్కారు పనితీరును తీవ్రంగా విమర్శించారు. ఏడాది వైసీపీ పాలనలో పేదలు, రైతుల సమస్యలు అన్నీఇన్నీ కావన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అనేక పథకాలు రద్దు చేశారన్నారు. స్కీమ్‌ల పేరుతో స్కామ్‌లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు చంద్రబాబు. కరోనా కిట్లు, బ్లీచింగ్ పౌడర్‌లోనూ కుంభకోణాలకు తెరలేపారంటూ ఎద్దేవా చేశారు. ఇక... సీఎం సొంత కంపెనీకి లీజు పొడిగించుకున్నారని, నీళ్లు కేటాయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఏడాది విధ్వంస పాలనపై టిడిపి ఛార్జిషీట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బాబు పిలుపునిచ్చారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి దుర్మార్గానికి తెగించలేదని మండిపడ్డారు..

సరస్వతి పవర్‌కు 50ఏళ్ల లీజు..... సీఎం జగన్ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అన్నారు. మీ సొంత వ్యాపారాల అభివృద్ది కోసమేనా ఒక్క ఛాన్స్ అని అడిగింది? అని ప్రశ్నించారు చంద్రబాబు. ఏడాది వైసిపి పాలనలో రైతులు, పేదల సమస్యలు అన్నీఇన్నీ కావన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో గనులన్నీ వైసీపీ నేతలే కబ్జాలు చేశారని ఆరోపించారు. ఇతరులపై తప్పుడు కేసులు పెట్టడం, జరిమానాలతో బ్లాక్‌మెయిల్‌ రాజకీయలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో వీటన్నింటిని చర్చకు తీసుకు రావాలని, రైతులు, పేదల సమస్యలపై రాజీలేని పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.

టీడీపీ సానుభూతిపరుల ఆర్థిక మూలాలను దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఇక పార్టీ సంస్థగత అంశాలపై చర్చించారు . పార్టీకి ద్రోహం చేసిన వారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. పార్టీ ద్రోహులు చరిత్ర హీనులుగా మిగిలి పోతారని మండిపడ్డారు.పార్టీకి ద్రోహం చేసిన వారెవరినీ ప్రజలు ఆదరించరని చెప్పారు. ద్రోహులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని సూచించారు.

Tags

Next Story