హైకోర్టులో మంత్రి కేటీఆర్‌కు ఊరట

హైకోర్టులో మంత్రి కేటీఆర్‌కు ఊరట
X

ఫామ్ హౌజ్ విషయంలో కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట కల్గింది. ఫామ్ హౌజ్ కేసులో NGT ఆర్డర్ పై హైకోర్టు స్టే ఇచ్చింది. 111 జీవోకు విరుద్దంగా మంత్రి కేటీఆర్ ఫామ్ హౌజ్ నిర్మించారంటూ NGT గతంలో నోటీసులు జారీచేసింది. ఫామ్ హౌజ్ ను నిబంధనలకు విరుద్దంగా నిర్మించారంటూ కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి NGT లో ఫిటీషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన NGT మంత్రి కేటీఆర్ తోపాటు.. హెచ్‌ఎండిఏ, పిసిబీలకు నోటీసులు ఇచ్చింది. NGT కేంద్ర పర్యావరణ ప్రాంతీయ అధికారి నేతృత్వంలో నిజ నిర్దారణ కమిటీ ఏర్పాటుచేసింది. రెండు నెలల్లో నివేధిక ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. ఇప్పుడు NGT ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది.

Tags

Next Story