గురువారం నుంచి అందరికీ శ్రీవారి దర్శనం

గురువారం నుంచి అందరికీ శ్రీవారి దర్శనం
X

గురువారం నుంచి అందరికీ తిరుమల శ్రీవారి దర్శనభాగ్యం కల్పించనున్నారు. దీంతో భక్తజనం.. దర్శన టోకెన్ల కోసం బారులు తీరారు. తిరుమలలో మొత్తం 3 ప్రాంతాల్లో టోకెన్లు అందిస్తున్నారు. విష్ణునివాసం వద్ద ఏకంగా 5 కిలోమీటర్ల మేర క్యూ లైన్ కనిపిస్తోంది. ఆన్‌లైన్‌లో ఇప్పటికే 3వేల టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు భక్తులు. రోజుకు 6 నుంచి 7 వేల మందికి దర్శనం ఏర్పాట్లు చేశారు. క్యూ కాంప్లెక్స్‌లోకి గంటకు 500 మందినే అనుమతిస్తారు. ఉదయం ఆరున్నర నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకే దర్శనం ఉంటుంది. శ్రీవారి మూలమూర్తి దర్శనానికే అనుమతిస్తారు. వకుళమాత, యోగ నరసింహస్వామి ఆలయాలకు అనుమతించరు. అలాగే ఆర్జిత సేవలకూ అనుమతి లేదు

Tags

Next Story