ఏపీలో మరోసారి పెరిగిన కరోనా కేసులు

ఏపీలో మరోసారి పెరిగిన కరోనా కేసులు
X

ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో మొత్తం 15,384 శాంపిల్స్ ను పరీక్షించగా. కొత్తగా మరో 136 పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ లో పేర్కొంది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4126కి చేరింది.

అలాగే గత 24 గంటల్లో 72మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 2475 మంది కోలుకుని ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 1573 మంది చికిత్స పొందుతున్నారు. కాగా ఇప్పటివరకూ 78 మంది మృతి చెందారు.

Tags

Next Story