అమిత్ షా తో సమావేశమైన కేజ్రీవాల్.. అన్ని విధాలా సహకారం

అమిత్ షా తో సమావేశమైన కేజ్రీవాల్.. అన్ని విధాలా సహకారం
X

దేశ రాజధానిలో కరోనావైరస్ పరిస్థితిపై చర్చించడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సమావేశమయ్యారు. కరోనావైరస్ కు వ్యతిరేకంగా పోరాటంలో షా తనకు అన్నివిధాలా సహకారాన్ని ఇస్తానని చెప్పినట్టు కేజ్రీవాల్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఢిల్లీలో COVID-19 పరిస్థితిపై ఇరువురు నాయకుల మధ్య వివరణాత్మక చర్చ జరిగిందని ఒక అధికారి తెలిపారు. COVID-19 చికిత్స కోసం ఇతర రాష్ట్రాల ప్రజలు ఢిల్లీకి రావడం ప్రారంభించిన తర్వాత జూలై 31 నాటికి ఢిల్లీకి 1.5 లక్షల పడకలు అవసరమని కేజ్రీవాల్ చెప్పారు.

కాగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి మరియు ఇతర విషయాలకు వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేసిన కొద్ది రోజుల తరువాత షా-కేజ్రీవాల్ సమావేశం జరగడం విశేషం. ఇక బుధవారం, ఢిల్లీలో 1,501 తాజా COVID-19 కేసులు నమోదయ్యాయి, ఈ సంఖ్య 33,000 కు చేరుకుంది, ఈ వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య 984 కు చేరుకుంది.

Tags

Next Story