coronavirus : చైనాలో మూడంటే మూడే కేసులు..

coronavirus : చైనాలో మూడంటే మూడే కేసులు..

కరోనావైరస్ కు కేంద్ర బిందువైన చైనాలో కేసులు పూర్తిగా తగ్గిపోయాయి.. మొదట్లో వేలాది కేసులు నమోదు కాగా.. ఇప్పుడు ఆ సంఖ్య ఇందుకు లోపే పడిపోయింది. చైనాలో బుధవారం మూడు కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి, దీంతో దేశం మొత్తం 83,046 కు పెరిగింది. ఆ ముగ్గురు రోగులు ఇటీవల ఇతర దేశాల నుంచి చైనాకు వచ్చారని జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. ఇక విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,786 గా ఉందని వీరిలో మొత్తం 1,732 మంది రోగులు కోలుకోవడంతో ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ చేసినట్లు జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. మరోవైపు చైనాలో ప్రస్తుతం 68 మంది మాత్రమే కరోనా నుంచి కోలుకోవాల్సి ఉంది.

ఇదిలావుంటే గత డిసెంబర్‌లో చైనా హుబీ ప్రావిన్స్ రాజధాని వుహాన్‌లో ఉద్భవించినప్పటి నుండి, ఈ వైరస్ 188 దేశాలు , ప్రాంతాలలో 411,600 మందికి పైగా ప్రాణాలను బలితీసుకుంది. యుఎస్, బ్రెజిల్ మరియు రష్యా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత నష్టపోయిన దేశాలుగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 7.25 మిలియన్లకు పైగా కేసులు నమోదయ్యాయి, అయితే రికవరీలు ఇప్పుడు 3.38 మిలియన్లకు పైగా ఉన్నాయని అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story