మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాం: సీఎం కేసీఆర్

మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాం: సీఎం కేసీఆర్
X

మిడతల దండుతో ప్రమాదం పొంచి ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తగా ఉండాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. మిడతల దండునుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు సిఎం వెల్లడించారు. గత నెలలో మూడు విడతలుగా దేశంలోకి ప్రవేశించిన మిడతల దండు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వరకు వచ్చాయన్నారు. ఇప్పుడు వచ్చిన మిడతల దండు తెలంగాణ సమీపంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రానికి 200 కి. మీ దూరంలో మహారాష్ట్రంలోని రాంటెక్ వద్ద గల అజ్నీ అనే గ్రామంలో మిడతల దండు ఉందన్నారు. దానిప్రయాణం దక్షిణ వైపు సాగితే చాలా తక్కువ సమయంలోనే తెలంగాణలోకి ప్రవేశించే ప్రమాదం ఉందన్నారు.

మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని కాపాడే చర్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిభవన్ లో సమీక్షించారు. మిడతల దండు గమనంపై సమాచారం తెప్పించుకున్నారు. మరోవైపు ఈనెల 20నుంచి జులై 5వరకు మళ్లీ మిడతల దండు వచ్చే అవకాశం ఉందన్ని నిపుణులు తెల్చారు. ఆ సమయంలో తెలంగాణాలో వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో పంటలు మెలకెత్తుతాయన్నారు. పంటలు మొలకెత్తే సమయంలో మిడతల దండు దాడిచేస్తే భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సరిహద్దుల్లోని 8 జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు.

Tags

Next Story