నిరసన విరమించిన డాక్టర్లు

నిరసన విరమించిన డాక్టర్లు

డాక్టర్లపై దాడులు దురదుష్టకరమన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. వైద్యులపై దాడిచేసిన వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. గాంధీ హాస్పత్రిలో జూనియర్ డాక్టర్లపై దాడికి నిరసనగా వైద్యులు ఆందోళన చేపట్టడంతో.. మంత్రి గాంధీకిచేరుకొని నాలుగు గంటలపాటు వారితో చర్చించారు. వైద్యుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి వారికి హామి ఇవ్వడంతో వైద్యులు నిరసన విరమించారు. ఆందోళన విరమించి విధుల్లో చేరుతున్న జూనియర్ వైద్యులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

కరోనా విస్తరిస్తున్న సమయంలో వైద్యులు ప్రాణాలను పణంగా పెట్టి చికిత్స అందిస్తున్నారని మంత్రి ఈటల అన్నారు. అలాంటి వారిపై దాడులు సరైంది కాదన్నారు. రోజుల తరబడి ఇంటికి వెళ్లకుండా కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్నారన్నారు. ఇలాంటి వైద్యులపై దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. ఇలాంటి సంఘటనలను ఎట్టిపరిస్థితుల్లో సహించమన్నారు. హాస్పిటల్ ల్లో డీసెంట్రలైజేషన్ పై సిఎంతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామన్నారు. సమస్యలు తలెత్తకుండా ప్రతి వారం జూడాలతో గాంధీలోనే సమావేశమవుతామన్నారు. డ్యూటీలో ఉన్న వైద్యులకు వసతి సౌకర్యం కల్పిస్తామని వారికి హామి ఇచ్చారు.

Tags

Next Story