అంతర్జాతీయం

అమెరికాలో 20 మిలియన్లు దాటిన కరోనా కేసులు.. జూన్ 19 నుంచి ర్యాలీలు..

అమెరికాలో 20 మిలియన్లు దాటిన కరోనా కేసులు..  జూన్ 19 నుంచి ర్యాలీలు..
X

యుఎస్‌లో కరోనా వైరస్ సంక్రమణ కేసులు 2 మిలియన్లకు చేరుకున్నాయి. బుధవారం, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొత్తం కరోనా ఇన్ఫెక్షన్ కేసులు 2,000,464 కు పెరిగాయి. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ గణాంకాల ప్రకారం, అమెరికాలో ఇప్పటివరకు మొత్తం 112,924 మంది కరోనా సంక్రమణ కారణంగా మరణించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్రమణ కేసులలో అమెరికా మొదటి స్థానంలో ఉంది.

రెండవ స్థానంలో బ్రెజిల్ ఉండగా, ఇప్పటివరకు ఇక్కడ మొత్తం కరోనా సంక్రమణ కేసులు 7.72 లక్షలకు పైగా ఉన్నాయి. అమెరికా ప్రతిరోజూ 5 లక్షల పరీక్షలు చేస్తుంది. ఇదిలావుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూన్ 19 నుంచి ఓకాహోమా నుంచి ఎన్నికల ర్యాలీని ప్రారంభించనున్నారు. అంటువ్యాధి కారణంగా మూడు నెలలు వాయిదా పడ్డ ర్యాలీలు.. జూన్ 19 న ఫ్లోరిడా, అరిజోనా, నార్త్ కరోలినా, ఒకాహోమా నుంచి ప్రారంభిస్తామని ట్రంప్ తెలిపారు.

Next Story

RELATED STORIES