ప్రజల్ని మోసం చేస్తున్న వాలంటీర్లు

ఏపీలో ఏ సంక్షేమ పథకం పొందాలన్నా వాలంటీర్ వ్యవస్థ కీలకం. వీరి ద్వారానే దరఖాస్తులు చేసుకోవాలి. ఇదే అదనుగా కొందరు వాలంటీర్లు ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. జిల్లాలోని గోకవరం మండలం ఇటీకాయపల్లి శివారు గ్రామమైన గోపాలపురంలో.... వాలంటీర్ ధనలక్ష్మీ, తన భర్తతో కలిసి పేదల డబ్బులు కాజేసింది. ధనలక్ష్మీ భర్త... మురళీ ఈ గ్రామంలో వాలంటీర్‌గా చెలామణి అవుతున్నాడు. అతనే నేరుగా ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు. అంతేకాదు.. రేషన్, ఉపాధిహామీ, పెన్షన్ వంటి పథకాలు కోసం జనం నుంచి వేలిముద్రలు కూడా సేకరిస్తున్నాడు...
ప్రజల అమాయకత్వాన్ని గుర్తించిన మురళీ .. తన ప్లాన్ అమలు చేశాడు. మినీ బ్యాంకింగ్ అనే ఆప్‌ను తన సెల్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని... గ్రామంలో 30 మందితో రైతుభరోసా, ఉపాధి పనుల డబ్బులను వారి ఖాతాల నుంచి తనఖాతాల్లోకి మళ్లించుకున్నాడు. ఈ విషయం తెలియని జనం.. బ్యాంకుకు వెళ్లగా.. డబ్బులు లేవని తెలుసుకుని అవాక్కయ్యారు. మురళీనే....వేలి ముద్రలు వేయించుకుని డబ్బులు కాజేసిన విషయం తెలుసుని లబోదిబోమంటున్నారు.
తమకు న్యాయం చేయాలని, వాలంటీర్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. దీనిపై గోకవరం పోలీస్ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు. అయితే..వైసీపీ నేతలు దీన్ని వెలుగులోకి రాకుండా ప్రయత్నించారు. కానీ.. టీవీ5 దీన్ని బయటపెట్టడంతో ఈ వాలంటీర్ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. వాలంటీర్ భర్త మురళీ అక్రమాల గురించి టీవీ5 వరుస కథనాలు ప్రసారం చేయడంతో... అటు అధికారులు సైతం స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు జిల్లా కలెక్టర్. సమగ్ర విచారణ చేసి కలెక్టర్‌కు అందించనున్నారు అధికారులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

