మాస్కులు ఉన్న వారికే శ్రీవారి దర్శనం: వైవీ సుబ్బారెడ్డి

మాస్కులు ఉన్న వారికే శ్రీవారి దర్శనం: వైవీ సుబ్బారెడ్డి
X

నేటి నుంచి తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులందరికీ స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నామని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు ఉన్న వారికి మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని చెప్పారు. ఉదయం 7.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు భక్తులకు స్వామి దర్శనం చేయిస్తున్నామని అన్నారు. మాస్క్లులు ధరించిన వారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నామని తెలిపారు. అలాగే.. అలిపిరి నడక మార్గంలోనే భక్తులకు అనుమతిస్తున్నామని.. భక్తుల భద్రత దృష్ట్యా శ్రీవారి మెట్ల మార్గంలో అనుమతి నిషేధించామని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి పత్రం తప్పని సరిగా తెచ్చుకోవాలని పేర్కొన్నారు.

Tags

Next Story