ఏపీలో కొత్తగా 141 కరోనా కేసులు..

ఏపీలో కొత్తగా 141 కరోనా కేసులు..
X

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొత్తగా మరో 141 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మొత్తం 11,775 నమూనాలను పరీక్షించారు. దీంతో మరోసారి వందకు పైగా కేసులొచ్చాయి. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసులు మొత్తం 4402 కు చేరింది.

ఇక కొత్తగా వివిధ ప్రాంతాల్లో 59 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. దీంతో ఇప్పటివరకూ డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2599 కి చేరింది. కోవిడ్ భారిన పడి ఇప్పటివరకూ 80 మంది మనరాణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 1723గా ఉంది.

Tags

Next Story