అచ్చెన్నాయుడు అరెస్టును నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ నిరసనలు

అచ్చెన్నాయుడు అరెస్టును నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ నిరసనలు
X

శాసనసభాపక్ష ఉపనేత, రాష్ట్ర మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అరెస్టును నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధర్నా చేశారు. ప్రధాన రహదారిలోని జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. ESI స్కాంలో ఎలాంటి సంబంధం లేని అచ్చెన్నాయుడును అరెస్టు చేయడం దారుణమని నాయకులు విమర్శించారు. ESI స్కాంకు సంబంధించి విచారణ చేసిన విజిలెన్స్‌ కమిటీ వెల్లడించిన నివేదికలో అచ్చెన్నాయుడు పేరు లేనప్పటికీ.. ఆయన్ను అరెస్టు చేయడం ప్రభుత్వ కుట్రపూరిత ధోరణికి నిదర్శనమని.. మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ మండిపడ్డారు.

Tags

Next Story