పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌

పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌
X

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడుని ఏసీబీ అరెస్ట్ చేయడంపై.. అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్యనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అచ్చెన్నాయుడును అరెస్ట్ చేయడం, తదితర పరిణామాలపై నేతలతో చంద్రబాబు చర్చించినట్టు తెలుస్తోంది. అచ్చెన్న అరెస్ట్ నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు వ్యవహరించాల్సిన తీరుపై ఆయన చర్చించారు.

కాగా, అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి జగన్ కుట్రపూరితంగా అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయించారని చంద్రబాబు ఆరోపించారు. ఈ సందర్బంగా అచ్చెన్నాయుడు అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఒక బీసీ నాయకుడు కాబట్టే అతన్ని అరెస్ట్ చేయించారని.. అచ్చెన్నకు ఏమైనా జరిగితే సీఎం జగనే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.

Tags

Next Story