పొలంలో పడగ విప్పిన నాగుపాము.. భయంతో కూలీలు..

పొలంలో పడగ విప్పిన నాగుపాము.. భయంతో కూలీలు..

పాము.. ఆ పేరు వింటేనే భయం వేస్తుంది.. ఇంక ప్రత్యక్షంగా చూడడమంటే.. అందులో పడగ విప్పిన నాగు పాము బుసలు కొడుతుంటే.. వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడతారు. ఆదిలాబాద్ జిల్లా బాసర సమీపంలోని ఓ రైతు తన పొలంలో కూలీలను పెట్టి పని చేయించుకుంటున్నాడు. ఇంతలో ఓ నాగు పాము వారు పని చేసే దగ్గర ప్రత్యక్షమైంది. బుసలు కొడుతున్న ఆ నాగును చూసి కూలీలతో పాటు రైతు వణికి పోయారు. వెంటనే రైతు పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పాములు పట్టే వ్యక్తి రాము కర్రతో ఆడిస్తూ చాకచక్యంగా పామును ఒడిసి పట్టుకున్నాడు. జాగ్రత్తగా తీసుకువెళ్లి దూరంగా ఉన్న అడవిలో వదిలేశాడు. దీంతో రైతు, కూలీలు ఊపిరి పీల్చుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story