ఢిల్లీలోని కెమికల్ గిడ్డంగిలో భారీ అగ్నిప్రమాదం

ఢిల్లీలోని కెమికల్ గిడ్డంగిలో భారీ అగ్నిప్రమాదం
X

వాయువ్య ఢిల్లీలోని స్వరూప్ నగర్ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. వార్తా సంస్థ ANI ప్రకారం, స్వరూప్ నగర్ ప్రాంతంలో ఉన్న ఒక రసాయన కర్మాగారం గిడ్డంగిలో ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను అదుపుచేశారు. ఇందులో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. మంటలను పూర్తిగా నియంత్రించామని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ యశ్‌పాల్ సింగ్ చెప్పారు. ఇందులో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని జరగలేదని చెప్పారు. అయితే అగ్ని ప్రమాదానికి కారణాలు మాత్రం వెల్లడించలేదు.

Tags

Next Story