ఉత్తరాంధ్రలో గురువారం భారీ వర్షం

ఉత్తరాంధ్రలో గురువారం భారీ వర్షం
X

ఉత్తరాంధ్రలో గురువారం భారీ వర్షం కురిసింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో శ్రీకాకుళం జిల్లాలో కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు విరిగి రోడ్డు మీదపడ్డాయి. అలాగే భామిని మండలం దిమ్మిడిజోలలో పిడుగులు పెద్దఎత్తున పడ్డాయి. ఇటు విజయనగరం జిల్లాలోని విజయనగరం, డెంకాడ, గంట్యాడ, నెల్లిమర్ల, పూసపాటిరేగ మండలాల్లో భారీ వర్షం కురిసింది.

అలాగే పలు మండలాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఇదిలావుంటే నైరుతి రుతుపవనాల ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. గురువారం ఇది బలపడటంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, అలాగే దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.

Tags

Next Story